పుట్టిన రోజు కానుక

ఈ మధ్య మా ఆవిడ పుట్టిన రోజు వచ్చింది. ఏం కానుక ఇవ్వాలో అర్థం కాలేదు, కానీ తప్పనిసరిగా ఏదైనా surprise ఇద్దామనుకున్నాను. ఇంకేం, ఇంటెర్నెట్లో ఒక చూడ చక్కటి teddy bear ఆర్డర్ చేసాను. ఆ కానుకతో ఒక ఉత్తరం కూడ రాశాను, నేను ఇచ్చిన సందేశం(అదే ఉత్తరం) ఒక మంచి designలో వస్తుంది అని చెప్పారు. Preview కూడ చూపించారు. ఇంకేం, కొంచెం ఉత్సాహం పెరిగి చకచకా డబ్బులు పే చెసాను. చివరికి surprise నాకు వచ్చింది మా ఆవిడకు కాదు. ఎందుకంటే, కానుక మూడు రోజుల ముందుగానె డెలివరి చేసారు. teddy bear మరియు design రెండు పరమ చెత్తగా ఉన్నాయి. డబ్బులు మరియు టైం, రెండు వేస్టు అయ్యాయి.

ఇక ఎప్పటి నుండో, ఏ మాత్రం use చేయని నా సృజనాత్మకత బయటకి తీసాను. రాత్రంతా కూర్చొని, ఒక మంచి video తయారు చేసాను మా ఆవిడ ఫొటోలన్ని పెట్టి. backgound music ఖడ్గం సినిమా లోని, నువ్వే నువ్వే పాట పెట్టాను. ప్రతి ఫోటోకి ఒక చిన్న caption పెట్టాను. తనకు ఇది బాగ నచ్చింది.నేను కూడా చాల సంతోషపడ్డాను.

నా స్నేహితులు మరియు తన స్నేహితులు చాల మెచ్చుకున్నారు ఈ కానుకను. అందుకే బ్లాగులో పెడదామని పెట్టాను, ఇతరులకు కూడ ఇది inspiration ఇస్తుందని.


మీకు ఆ కానుక చూడలని ఉందా? కింది వీడియోలో Play button నొక్కండి మరి.