తిరుమల వాసా - Tirumala vaasa

తిరుమల వాసా
తిరుమల వాసా, సుమధుర హాస
ఈ హరతి గొనవయ్యా

శ్రితజన పోష, జయ జగదీశ
మా ఆర్తిని కనవయ్యా

అడుగే పడనీ పయనాన
అడుగే పడనీ పయనాన
వెలుగై నడిపే నీ కరుణ

ఆ వరాన్ని ఈ దోసిలిలోన నిలుపుకుందుకే
తపములు చేసా

తిరుమల వాసా, సుమధుర హాస
ఈ హరతి గొనవయ్యా

శ్రితజన పోష, జయ జగదీశ
మా ఆర్తిని కనవయ్యా

పుట్టిన రోజు కానుక

ఈ మధ్య మా ఆవిడ పుట్టిన రోజు వచ్చింది. ఏం కానుక ఇవ్వాలో అర్థం కాలేదు, కానీ తప్పనిసరిగా ఏదైనా surprise ఇద్దామనుకున్నాను. ఇంకేం, ఇంటెర్నెట్లో ఒక చూడ చక్కటి teddy bear ఆర్డర్ చేసాను. ఆ కానుకతో ఒక ఉత్తరం కూడ రాశాను, నేను ఇచ్చిన సందేశం(అదే ఉత్తరం) ఒక మంచి designలో వస్తుంది అని చెప్పారు. Preview కూడ చూపించారు. ఇంకేం, కొంచెం ఉత్సాహం పెరిగి చకచకా డబ్బులు పే చెసాను. చివరికి surprise నాకు వచ్చింది మా ఆవిడకు కాదు. ఎందుకంటే, కానుక మూడు రోజుల ముందుగానె డెలివరి చేసారు. teddy bear మరియు design రెండు పరమ చెత్తగా ఉన్నాయి. డబ్బులు మరియు టైం, రెండు వేస్టు అయ్యాయి.

ఇక ఎప్పటి నుండో, ఏ మాత్రం use చేయని నా సృజనాత్మకత బయటకి తీసాను. రాత్రంతా కూర్చొని, ఒక మంచి video తయారు చేసాను మా ఆవిడ ఫొటోలన్ని పెట్టి. backgound music ఖడ్గం సినిమా లోని, నువ్వే నువ్వే పాట పెట్టాను. ప్రతి ఫోటోకి ఒక చిన్న caption పెట్టాను. తనకు ఇది బాగ నచ్చింది.నేను కూడా చాల సంతోషపడ్డాను.

నా స్నేహితులు మరియు తన స్నేహితులు చాల మెచ్చుకున్నారు ఈ కానుకను. అందుకే బ్లాగులో పెడదామని పెట్టాను, ఇతరులకు కూడ ఇది inspiration ఇస్తుందని.


మీకు ఆ కానుక చూడలని ఉందా? కింది వీడియోలో Play button నొక్కండి మరి.


రామా రామా రామా

ఈ శ్లోకం నాకు చాలా ఇష్టం. మీకూ ఇష్టమే అని తలుస్తూ.
ఏమైనా తప్పులు దొర్లితే క్షమించండి మరియు నాకు తెలియపర్చండి.

దోం దోంతన, దోంతన దోంతన
దీం దీంతన, ఆ ఆ "2"

రామా రామా, రామా
నీలి మేఘ శ్యామా

రామా రామా, రామా
నీలి మేఘ శ్యామా

రావా రఘుకుల సోమ
భద్రాచల శ్రీరామా

మా మనసు, విరబూసే
ప్రతి సుమ గానం నీకేలే


కరుణించి, కురుపించే
నీ ప్రతి దీవెన మాకేలే


నిరతం పూజించే మాతో
దాగుడు మూతలు నీకేలా

రెప్పలు మూయక కొలిచాము
కన్నుల ఎదుటకు రావేలా


రామా రామా

రామా రామా, రామా
నీలి మేఘ శ్యామా

రావా రఘుకుల సోమ
భద్రాచల శ్రీరామా

జీవితాన్ని ఉత్తేజంగా ఉంచాడానికి కొన్ని ఉపాయాలు


అపుడపుడు మౌనం & ఏకాంతం - Silence gives a chance to review yourself, your thoughts in depth

సామాజిక సేవ - Service to human is service to god


సంగీతాన్ని ఆస్వాదించండి - Music is a divine language and you can enjoy it all time

ప్రకృతిని వీక్షించండి - Sunrise, Sunset, Flying birds and Rain


ధ్యానం - A wonderful method to re-energise yourself and your sorroundings completely


మార్పు లేదా క్రొత్త పని - Do something different which you don't do in normal life

మనిషి - మనసు

ప్రతి నిమిషం నా మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూనే వుంటుంది. ప్రొద్దున లేచిన సమయం నుండి రాత్రి నిద్ర పోయే వరకు ఆలోచనల పరంపర కొనసాగుతునే వుంటుంది.

అందరికి ఇలానే వుంటుందా? లేదా నాకు మాత్రమెనా?

ఉదయం లేవగానె అనుకుంటాను, ఈరోజు ఆలస్యంగా లేచాను మరునాడు కొంచెం తొందరగ నిద్ర లెవాలి అని. ఫొన్ బిల్లు చూడగానె అనుకుంటా, తర్వాతి నెలలో ఫొన్ కాల్స్ తగ్గించాలి అని.

వార్త పత్రిక చూసిన లేదా టివిలో వార్తలు చూసిన అనుకుంటాను, ఎందుకు ఇన్ని దుర్గటనలు జరుగుతున్నాయి అని? ఐతే అనావౄష్టి లేదంటె అతివౄష్టి, ఇవేం లేకపోతె తీవ్రవాదుల దాడులు లెదా నక్షులైట్ల పేలుళ్ళు. ఎందుకిలా జరుగుతుంది?

ఐతే కుటుంబం గురుంచి లేదా స్నేహితుల గురుంచి, లేదా డబ్బుల గురుంచి, లేదా రాజకీయల గురుంచి, లేదా పిల్లల గురుంచి, ఇలా ఎప్పుడూ ఏదో ఒక అలోచన నా మదిలో మెదులుతుంది

బహుశా అలోచనలు లేని మనిషి ఎవరు ఉండరేమో! అందరూ నాలానే ఆలోచిస్తారా?

నాకిష్టం


చిన్న పిల్లల నవ్వులు
వారి ముద్దులొలికే చేష్టలు

అన్ని వర్ణాల పువ్వులు
వాటి దరహాసం, సున్నితత్వం

తొలకరి జల్లులు
పిల్ల గాలులు


హాస్య చిత్రాలు
మధురమైన సంగీతం

సాయం సంధ్యా సమయం
పక్షుల కిలకిల


సాగర హొరు
అలల సవ్వడి

నీలి ఆకాశం
చుక్కల్లో చంద్రుడు

నా జీవిత భాగస్వామి
తన అల్లరి మాటలు
అనంతమైన ప్రేమ