Showing posts with label Mind. Show all posts
Showing posts with label Mind. Show all posts

మనిషి - మనసు

ప్రతి నిమిషం నా మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూనే వుంటుంది. ప్రొద్దున లేచిన సమయం నుండి రాత్రి నిద్ర పోయే వరకు ఆలోచనల పరంపర కొనసాగుతునే వుంటుంది.

అందరికి ఇలానే వుంటుందా? లేదా నాకు మాత్రమెనా?

ఉదయం లేవగానె అనుకుంటాను, ఈరోజు ఆలస్యంగా లేచాను మరునాడు కొంచెం తొందరగ నిద్ర లెవాలి అని. ఫొన్ బిల్లు చూడగానె అనుకుంటా, తర్వాతి నెలలో ఫొన్ కాల్స్ తగ్గించాలి అని.

వార్త పత్రిక చూసిన లేదా టివిలో వార్తలు చూసిన అనుకుంటాను, ఎందుకు ఇన్ని దుర్గటనలు జరుగుతున్నాయి అని? ఐతే అనావౄష్టి లేదంటె అతివౄష్టి, ఇవేం లేకపోతె తీవ్రవాదుల దాడులు లెదా నక్షులైట్ల పేలుళ్ళు. ఎందుకిలా జరుగుతుంది?

ఐతే కుటుంబం గురుంచి లేదా స్నేహితుల గురుంచి, లేదా డబ్బుల గురుంచి, లేదా రాజకీయల గురుంచి, లేదా పిల్లల గురుంచి, ఇలా ఎప్పుడూ ఏదో ఒక అలోచన నా మదిలో మెదులుతుంది

బహుశా అలోచనలు లేని మనిషి ఎవరు ఉండరేమో! అందరూ నాలానే ఆలోచిస్తారా?