మనిషి - మనసు

ప్రతి నిమిషం నా మనసు ఏదో ఒకటి ఆలోచిస్తూనే వుంటుంది. ప్రొద్దున లేచిన సమయం నుండి రాత్రి నిద్ర పోయే వరకు ఆలోచనల పరంపర కొనసాగుతునే వుంటుంది.

అందరికి ఇలానే వుంటుందా? లేదా నాకు మాత్రమెనా?

ఉదయం లేవగానె అనుకుంటాను, ఈరోజు ఆలస్యంగా లేచాను మరునాడు కొంచెం తొందరగ నిద్ర లెవాలి అని. ఫొన్ బిల్లు చూడగానె అనుకుంటా, తర్వాతి నెలలో ఫొన్ కాల్స్ తగ్గించాలి అని.

వార్త పత్రిక చూసిన లేదా టివిలో వార్తలు చూసిన అనుకుంటాను, ఎందుకు ఇన్ని దుర్గటనలు జరుగుతున్నాయి అని? ఐతే అనావౄష్టి లేదంటె అతివౄష్టి, ఇవేం లేకపోతె తీవ్రవాదుల దాడులు లెదా నక్షులైట్ల పేలుళ్ళు. ఎందుకిలా జరుగుతుంది?

ఐతే కుటుంబం గురుంచి లేదా స్నేహితుల గురుంచి, లేదా డబ్బుల గురుంచి, లేదా రాజకీయల గురుంచి, లేదా పిల్లల గురుంచి, ఇలా ఎప్పుడూ ఏదో ఒక అలోచన నా మదిలో మెదులుతుంది

బహుశా అలోచనలు లేని మనిషి ఎవరు ఉండరేమో! అందరూ నాలానే ఆలోచిస్తారా?

5 comments:

Naga said...

"అందరికీ" అలానే ఉంటుంది :) మీరొక్కరేం స్పెషల్ కాదు. హహ్హహ్హా... అందరికి అలాగే ఉంటే అప్పుడది "సహజం" అని వదిలేయవచ్చనే భావనా? లేక ... ??

ఎందుకిలా జరుగుతుంది అంటే, ఎన్నో రకాల సమాధానాలు మనకు అందరు చెబుతారు... మీరేం "నమ్మాలనుకుంటున్నారు"?

Niharika said...

Thanks for your comment. అవును అలా ఉంటుంది, కాని అలా ఉండకుండా ఏం చేయాలి? ప్రపంచాన్ని మనం కొంచెమైనా మార్చలేమా?

రాధిక said...

ఆలోచిస్తూ ఆలోచిస్తూవుంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమాధానమో,ఏదో ఒక దారో కనిపిస్తుంది.అందరికీ ఇలాగే వుంటుందేమో.కానీ ఆచరణలో పెట్టేవాళ్ళే తక్కువమంది వుంటారు.
అన్నట్టు నాకు నీహారిక అన్న పేరంటే చాలా ఇష్టం.

Niharika said...

radhika గారు,
Thank u for the reply. మీరు చక్కగా చెప్పారు. Hope I would get the solutions.

మీ బ్లాగు చూసాను నేను. మీ కవితలు చాల బాగున్నాయి.నీహరిక పేరు నాకు చాల చాల ఇష్టం

spandana said...

ఆలోచన అన్నది ప్రవహిస్తున్న నది లాంటిది. అది దాని గుణం. చివరికి నిద్రలోనూ ఆలోచిస్తుంది. అది సహజాతిసహజం. దీనికి భిన్నంగా వుంటేనే ఆలోచించాలి.

--ప్రసాద్
http://blog.charasala.com